నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరో పక్కా మాస్ స్టోరీతో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరుగుతోంది.
Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..
అయితే తాజా సమాచారం ప్రకారం.. చిత్ర విడుదల తేదీ మార్చి 26, 2026 గా ప్రకటించినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ ఆ డేట్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. అదే సమయానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. దీంతో పోటీని దృష్టిలో ఉంచుకుని ‘ది ప్యారడైజ్’ సినిమాను వేసవి కానుకగా 2026 మే 15న రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో నాని పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఆయన కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ షేడ్ అనే చెప్పొచ్చు. త్వరలోనే విడుదల తేదీ పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.
