Site icon NTV Telugu

HIT 3: నాని రాంపేజ్.. ఆరు రోజుల్లో ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్

Hit3

Hit3

నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాని కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమాలలోని మోస్ట్ వైరల్ ఫీలింగ్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. నాని నుంచి ఇలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ లేడీస్ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది.

Read More: Bhagavanth Kesari: మళ్ళీ భగవంత్ కేసరి కాంబో?

సినిమా విడుదలైన ఆరు రోజులలో రిలీజ్ చేసిన అన్ని ప్రాంతాలలో సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ వారం కూడా నాని హిట్ 3 సినిమాకి పెద్దగా పోటీ లేదు. సింగిల్ అనే సినిమాతో శ్రీ విష్ణు, శుభం అనే సినిమాతో సమంత వస్తున్నా, నాని మార్కెట్ నానికి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే, వీక్‌డేస్‌లో కాస్త ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే.

Exit mobile version