నాని హీరోగా, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, సినిమా అనౌన్స్‌మెంట్ గ్లిమ్స్‌లో నాని వాడిన పదజాలం అయితే అందరికీ షాక్ కలిగించింది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ఏంటి, ఇలాంటి సినిమా చేయడం ఏంటి? అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, ఈ సినిమా షూట్ పలు కారణాలతో అనుకున్నంత వేగంగా జరగలేదు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ వాయిదా కూడా పడవచ్చని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా షూట్‌కి ముందే భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఈ క్రమంలో ఓటీటీ సంస్థ ఒక రేటు ఫిక్స్ చేసింది, అలాగే రిలీజ్ డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేసింది. ఆ డెడ్‌లైన్ రీచ్ అయ్యేందుకు టీం చాలా కష్టపడుతోంది.
రోజుకు 3 గంటలు మాత్రమే నిద్ర పోయి షూట్ పూర్తి చేస్తున్నారు అని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో జరుగుతోంది. భారీ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశారు. రోజుకు మూడు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని, మిగతా సమయంలో షూట్‌కి సమయం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
