NTV Telugu Site icon

Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..

Untitled Design (45)

Untitled Design (45)

 నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read : Satya Dev : ‘జీబ్రా’ తో అదృష్టం పరీక్షించుకోనున్న సత్యదేవ్..
తాజగా ఈ చిత్రం అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి, రిలీజ్ నాటి నుండి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అసలు విషయం ఏంటంటే సరిపోదా శనివారం ఈస్ట్, గుంటూరు ఈ రెండు ఏరియాల్లో అక్కడిక్కడ సరిపోయిందని, ఖర్చులు రాలేదని.అంటే సుమారుగా ముఫై లక్షలు బయ్యర్లు నష్ట పోయారని తెలుస్తోంది. అటు సీడెడ్ లోను సరిపోదా శనివారం భారీ నష్టాలు చూసిందని సమాచారం. కానీ ఈ నష్టాలు అకారణంగా కురిసిన వర్షాల వలన వచ్చాయని లేదంటే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించేదని ట్రేడ్ అంచనా వేసింది. మరోవైపు  నైజాం, ఓవర్సీస్ లో సరిపోదా శనివారం భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆల్మోస్ట్ థియేటర్ రన్ ముగిసిన సరిపోదా శనివారం డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.
Show comments