NTV Telugu Site icon

Nani : నేచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ @ 16 ఇయర్స్.. ఎవరెవరు ఏమన్నారంటే..?

Untitled Design (11)

Untitled Design (11)

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అందుగు పెట్టి అష్టాచమ్మా తో హీరోగా మారి, పక్కింటి కుర్రాడిగా నేచురల్ స్టార్ బిరుదు అందుకుని సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న నాని టాలీవుడ్ లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇటీవల సరిపోదా శనివారం విజయ వేడుకలో నానికి పలువురు అభినందనలు తెలిపారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ  : ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాలుగేళ్ళుగా ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నాను. సినిమానే ఆయన ప్రాణం. సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు.

యాక్టర్ SJ సూర్య : నాని లో ఒక అమితాబ్ బచ్చన్ ని చూశాను. తను చెప్పిన ఒక్క డైలాగ్ ‘అడుగు’లో 16 ఏళ్ల అనుభవం కనిపించింది.

హీరోయిన్ ప్రియాంక మోహన్ : నాని నా ఫేవరట్. ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ఆయనతో రెండు సినిమాలకి పని చేయడం ఆనందంగా వుంది.

ప్రొడ్యూసర్ దిల్ రాజు : తెలుగులో 16 ఏళ్ళుగా ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్న ఏకైక హీరో నాని. తను చాలా హార్డ్ వర్క్ చేసే హీరో. నేను లోకల్ నుంచి మా అసోషియేషన్ వుంది. సినిమా అంటే తనకి భయం భక్తి ప్రేమ. అదే తన సక్సెస్.

డైరెక్టర్ హను రాఘవపూడి : ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. ఈ 16 ఏళ్లలో రెండు జనరేషన్స్ మెమరీస్ లో వుండిపోయాడు. తనకి సినిమా అంటే భయం భక్తి ప్రేమ. అందుకే వరుసగా శ్యాం సింగారాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి వైవిధ్యమైన సినిమాలు చేయగలుగుతున్నారు. నాని చాలా మందికి స్ఫూర్తి

డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ : ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. 30 ప్లస్ సినిమాలు చేసి ఒక సంపూర్ణ నటుడిగా ఎదిగిన నాని గారి కెరీర్ నేను ఒక పార్ట్ అవ్వడం ఆనందంగా వుంది. నాని లాంటి నటుడు తెలుగులో వుండటం గర్వంగా వుంది

డైరెక్టర్ శివ నిర్వాణ : ఆడియన్స్ కి ఇంత గొప్ప ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తూ ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి కంగ్రాట్స్. సినిమాని ఎంత ప్రేమిస్తే సినిమా మనల్ని అంత ప్రేమిస్తుంది. నిన్ను కోరి మా కెరీర్ లో చాలా స్పెషల్.

సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ : ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాని గారి నటనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన కథ ఎంపిక అద్భుతంగా వుంటుంది

Show comments