NTV Telugu Site icon

Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని & శనివారం టీమ్..

Untitled Design (3)

Untitled Design (3)

నాచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానుంది.  ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేష స్పందన రాబట్టింది

Aslo Read: SSMB 29: రాజమౌళి – మహేశ్ కాంబోలో ఆ సినిమా ఇక లేనట్టే..?

కాగా హీరో నాని, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున సరిపోదా శనివారం యూనిట్ తో కలిసి అలిపిరి మెట్ల మార్గలో కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. నడక‌మార్గంలో నానితో పలువురు భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా నానితో పాటు తిరుమల చేరుకున్నారు. vip బ్రేక్ దర్శనంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు నాని అండ్ టీమ్. అనంతరం నాని కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.  ఇక నాని నటించిన సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ నటుడు Sj సూర్య ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. జాక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV దానయ్య నిర్మించారు.

 

Show comments