NTV Telugu Site icon

Nani : ముచ్చటగా ముడోసారి ‘నాని – సాయి పల్లవి’.. దర్శకుడు ఎవరంటే..?

Untitled Design (16)

Untitled Design (16)

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబోకు పేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన MCA, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు వేటికవే సూపర్ హిట్స్. శ్యామ్ సింగ రాయ్ లోని సాయి పల్లవి నృత్యం నేచురల్ స్టార్ నటన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తుండగా, సాయి పల్లవి నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది. విరాట పర్వం తర్వాత గ్యాప్ ఇచ్చి తండేల్ లో నటిస్తోంది సాయి పల్లవి.

Also Read : Devara‌ : దేవర ఓవర్సీస్ ఇంతటి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణాలు ఏంటి..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాతో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ సాధించింది. ఇదిలా ఉండగా నాని, సాయి పల్లవి జంటగా ముచ్చటగా మూడోసారి నటించబోతున్నట్టు టాలీవుడ్ లో ఓ న్యూస్ వినిపిస్తుంది. ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కథ ను నాని కోసం రెడీ చేసాడట. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవిని  తీసుకోనున్నట్టు టాక్ .   శేఖర్ కమ్ముల సినిమాకు కూడా  దాదాపు ఈమెనే ఫిక్స్ చేసారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. శేఖర్ కమ్ములతో సాయి పల్లవి హ్యాట్రిక్ ఫిల్మ్ ( ఫిదా, లవ్ స్టోరీ) నాని తో హ్యాట్రిక్ (MCA, శ్యామ్ సింగ్ రాయ్) రెండు హ్యాట్రిక్ లు ఒకేసారి కంప్లిట్ చేసినట్టు అవుతుంది సాయి పల్లవి. ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర అనే సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.

Show comments