NTV Telugu Site icon

Nani: దసరా – 2లో దడ పుట్టించే క్యారక్టర్ లో కనిపించబోతున్న నాని..

Untitled Design 2024 08 12t123012.965

Untitled Design 2024 08 12t123012.965

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా  చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు.  ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన  శ్రీ‌కాంత్ ఓదెలతో మరో సినిమా  చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాగా నిలవనుంది.

Also Read :Vikram : బెజవాడలో సందడి చేసిన హీరో, హీరోయిన్.. 

దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు నిర్మాతగా సుధాకర్ చెరుకూరి. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. నాని ఈ  సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని  అందులో ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని  తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా భారీ, భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ ను ఈ సినిమా పోస్ట‌ర్‌ ను డిజైన్ చేశారు మేకర్స్. స్లోగన్ కు తగ్గట్టుగానే సినిమాలో చాలా వేరియేషన్స్ వుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు. ప్రియాంకా మోహన్, SJసూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సరికొత్త కథనంతో రానుంది.  ఈ సినిమా ఆగష్టు 29న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.

 

 

Show comments