Site icon NTV Telugu

IBomma Ravi: హిట్ 3 లీక్.. పాపం ఎంప్లాయ్స్ ని అనుమానించారు కదరా!

Hit 3 Ott

Hit 3 Ott

నాని హీరోగా ఈ ఏడాది హిట్ 3 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కి 18 గంటల ముందు ఐ-బొమ్మలో ఒరిజినల్ క్వాలిటీతో రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ హౌస్ అయితే కచ్చితంగా ఇది ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరో చేసిన పని అని భావించి, తమ సొంత ఉద్యోగులను అనుమానించి పోలీస్ కేసులను సైతం నమోదు చేయించి దర్యాప్తు చేయించింది. అయితే అప్పట్లో వారి మీద ఎవరు కేసులు పడలేదు. కానీ, అనుమానం వ్యక్తం చేయడంతో వారందరూ బాధపడిన పరిస్థితి ఏర్పడింది.

Also Read:Varanasi: జక్కన్న ఆవేదన విలువ 30 కోట్లు?

అయితే, ఇప్పుడు ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అయిన తర్వాత ఇదంతా అతని పనే అని అర్థమైంది. అతను ప్రొడక్షన్ కంపెనీలకు పంపించిన ఒరిజినల్ కంటెంట్‌ను వాటి సర్వర్‌లను హ్యాక్ చేసి డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇక నాని హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాస్ దక్కించుకుంది. అయితే, నాని సినిమా రిలీజ్‌కి ముందే రిలీజ్ చేయడంలో ఐ-బొమ్మ రవి పాత్ర ఉందని పోలీసులు తాజాగా గుర్తించడం గమనార్హం.

Exit mobile version