నేచురల్ స్టార్ నానిలో చమత్కారి ఉన్నాడు. బేసికల్ గా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చిన నానిలో క్రియేటివిటీ పాలు ఎక్కువే! మీరు జాగ్రత్తగా గమనిస్తే… అతను నటించిన సినిమాల ప్రారంభంలో వచ్చే ‘పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కాన్సర్ కు కారకం’ అనే ప్రకటన వాయిస్ ఓసారి వినండి… అది రొటీన్ కు భిన్నంగా ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో అయితే ‘సిగిరెట్, మందు తాగకండిరేయ్… పోతారు’ అని చెప్పాడు నాని.
Read Also : యూఎస్ లో రజినీకాంత్… లేటెస్ట్ పిక్ వైరల్
ఇక విషయానికి వస్తే… నాని తాజాగా కొవిడ్ వాక్సినేషన్ వేయించుకున్నాడు. సహజంగా ఏ ఆర్టిస్ట్ అయినా ‘నేనూ వాక్సిన్ వేయించుకున్నాను. మీరూ వేయించుకోండి’ అనే కదా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడు. కానీ నాని అలా కాదు… ‘మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎ) వాక్సిన్ వేయించుకోవడం… సేఫ్ గా ఉండటం. బి) మనం సేఫ్ గా ఉండటం కోసం వాక్సిన్ వేయించుకోవడం. ఇందులో ఒకటి ఎంచుకుందాం’ అని చెప్పాడు. అందుకే అంటారు నాని చమత్కారి అని. అన్నట్టు నాని నటించిన ‘టక్ జగదీశ్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంటే, ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాల సక్సెస్ పై నాని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.
