NTV Telugu Site icon

Nani : సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు..ఎక్కడో తెలుసా..?

Untitled Design (15)

Untitled Design (15)

మిడ్ రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని యమా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలుతో జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కింది సరిపోదా శనివారం. ఇటీవల చెన్నై ప్రమోషన్స్ లో భాగంగా  ఈ చిత్ర తమిళ ట్రైలర్ ను రిలీజ్  చేసాడు నేచురల్ స్టార్. అటు కేరళలోని ఓ ఈవెంట్ లో మళయాళ ట్రైలర్ ను విడుదల చేసాడు.

Also Read: Samantha : ఏటో వెళ్ళిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది.. ఎందుకంటే..?

నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. కాగా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు మేకర్స్. ఈ నెల 24న హైదరాబాద్ లోని నోవాటెల్ లో సాయంత్రం 6: 00 గంటలకు నిర్వహించనున్నట్టు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. వారంలో కేవలం శనివారం మాత్రమే విలన్స్ ను వేటాడే హీరో చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంలో రానుంది సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళ నటుడు sj సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తుండగా తమిళ పొన్ను ప్రియాంక అరుళ్ మోహన్ నానికి జోడిగా నటిస్తుండగా DVV ఎటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments