Site icon NTV Telugu

నాని ఖాతాలో మరో మైలురాయి

Nani crossed 4 Million followers on Instagram

సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక నానికి టాలీవుడ్ లో భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే.

Read Also : “అధీరా”కు “కేజీఎఫ్” టీం బర్త్ డే విషెస్

2012లో ట్విట్టర్‌లో చేరిన నాని తోటి నటులు, సినీ పరిశ్రమ స్నేహితుల కృషిని ఎప్పుడూ మెచ్చుకుంటాడు. ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘జెంటిల్మెన్’, ‘అష్టా చమ్మా’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘మజ్ను’, ‘నేను లోకల్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన నాని ప్రస్తుతం టాలీవుడ్ గ్యారంటీ హీరోల్లో ఒకరు. ఆయన సినిమా అంటే హిట్ పక్కా అని నిర్మాతల నమ్మకం. ప్రస్తుతం నాని కిట్టిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. “శ్యామ్ సింగ రాయ్”, “అంటే సుందరానికి” చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Exit mobile version