వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన ప్రతిష్టాత్మక 34వ (#Nani34)ను సుజిత్ తో చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా నేడు వైభవంగా ప్రారంభమైంది. ఈ పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం ‘OG’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, అభిరుచి గల నిర్మాత వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై), నాని సొంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ చేతులు కలిపాయి. నిజానికి ఈ సినిమాను ముందు డీవీవీ సంస్థ నిర్మిస్తుందని భావించారు. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు నిహారిక ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి దిగింది.
Also Read:Mirai : టికెట్ ధరలు పెంచకుండా 150 కోట్లు వసూలు చేసిన మిరాయ్
ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దసరా శుభ సందర్భంగా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి తన ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో నాని తండ్రి ఘంటా రాంబాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని, నిర్మాత వెంకట్ బోయనపల్లి కలిసి లాంఛనంగా స్క్రిప్ట్‌ను దర్శకుడు సుజీత్‌కు అందజేశారు. ప్రముఖ దర్శకులు రాహుల్ సాంకృత్యన్, శ్రీకాంత్ ఓదెల, మరియు శౌర్యవ్ కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించడం ఈ వేడుకకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.