Mirai : టికెట్ ధరలు పెంచకుండా 150 కోట్లు వసూలు చేసిన మిరాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కీలక మైలురాయిని అందుకుంది.
Also Read : Vilaya Tandavam: ‘విలయ తాండవం’ మొదలైంది!
Also Read
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
హనుమాన్ తర్వాత వరుసగా రెండోసారి 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తేజా సజ్జా కెరీర్‌కు మైల్ స్టోన్ గా నిలిచింది. రెండు బ్లాక్‌బస్టర్స్‌తో వరుస విజయాలు అందుకున్న ఆయన బాక్సాఫీస్ వద్ద డిపెండబుల్ హీరోగా ఎదుగుతున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ప్రెజెంటేషన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కంటెంట్ బలంతో పాటు పండుగ సీజన్ కలిసివచ్చి, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. టీమ్ మిరాయ్ టికెట్ ధరలు పెంచకుండా ఈ విజయాన్ని సాధించింది. భారీ హైప్, మంచి రివ్యూలు ఉన్నప్పటికీ సినిమాను అందరికీ అందుబాటులో ఉంచాలనే వారి సంకల్పాన్ని ఇది చూపిస్తోంది. దసరా సెలవులు థియేటర్లలో ప్రేక్షకులను మరింతగా రప్పిస్తుండటంతో మిరాయ్ డ్రీమ్ రన్ విజయవంతంగా కొనసాగనుంది.
తాజావార్తలు
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!