NTV Telugu Site icon

Mokshagna: పాన్ ఇండియా డెరైక్టర్ తో మోక్షు లాంఛ్.. సంబరాలకు సిద్ధం కండి!

Prasanth Varma Mokshagna Movie

Prasanth Varma Mokshagna Movie

Nandamuri Mokshagna to be Launched by Prasanth Varma: నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయాలలో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ ఒకటి. నిజానికి లెజెండ్ సినిమా ముందు వరకు ఆయన సినీ ఎంట్రీ గురించి చర్చలు జరిగేవి కాదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన కొన్ని ఫోటోలలో మోక్షజ్ఞ కనిపించడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమా హీరోగా మారతాడా అని నందమూరి అభిమానులందరూ ఎదురుచూడడం మొదలుపెట్టారు. బాలకృష్ణ కూడా ఎప్పటికప్పుడు ఈ ఏడాది మావాడు ఎంట్రీ ఉంటుందని పలు వేదికల మీద చెబుతూ రావడంతో ఆ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి.

Kalki 2898 AD : “కల్కి” దెబ్బకి బాలీవుడ్ సినిమా విడుదల వాయిదా..?

నిజానికి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ద్వారా ఆయన హీరోగా మారనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పుడు క్లారిటీ లేదు కానీ తాజాగా మోక్షజ్ఞ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ గా చెప్పబడుతున్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి షేర్ చేసి తాను వచ్చేస్తున్నాను సిద్ధం కండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దానికి తోడు నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉండే వైవిఎస్ చౌదరి కూడా తాను ఒక శుభవార్త విన్నానని మోక్షజ్ఞ తేజ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది ఇక టపాసులు సిద్ధం చేసుకోండి సంబరాలకు రెడీ అవ్వండి అంటూ రాసుకొచ్చాడు.

దీంతో నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి అంతా లైన్ క్లియర్ అయినట్లే. అయితే ఇప్పుడు ఆ లాంఛింగ్ డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. బోయపాటి పేరు ప్రముఖంగా వినిపించినా సరే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో బాలయ్య కుమారుడు హీరోగా మారబోతున్నాడని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మకు బాలయ్యకు అన్ష్టాపబుల్ షో ద్వారా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. హనుమాన్ సూపర్ హిట్ కొట్టి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ అయితే మోక్షజ్ఞ కి కరెక్ట్ లాంచ్ పాడ్ అని బాలకృష్ణ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ప్రచారం మాత్రమే కాగా ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

Show comments