NTV Telugu Site icon

Balayya : నందమూరి మోక్షజ్ఞ మెకోవర్ వీడియో..నెట్టింట వైరల్.!

Untitled Design (27)

Untitled Design (27)

బాలయ్య హీరోగా ఎంట్రీకోసం Sr.NTR ఫ్యాన్స్ ఎంత ఎదురు చూసారో నేడు అయన వారసుడు ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురుచూస్తున్నారు. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు.

వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. లెజెండ్ సినిమా వచ్చినప్పటి నుండి అదుగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అన్నారు తప్ప వస్తావ రూపం దాల్చలేదు. కాగాఇన్నేళ్లకు నందమూరి అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై మెరిసే సమయం వచ్చింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

కాగా ఇటీవల మోక్షు లేటెస్ట్ ఫొటోస్ లీక్ అవగా అవి నెట్టింట వైరల్ గా మారాయి. తాజగా మోక్షు వీడియో ఒకటి రిలీజ్ కాగా నెట్టింట వైరల్ గా మారింది. వీడియో లో స్లిమ్ గా, కూలింగ్ గ్లాస్ పెట్టిన సింహం లాంటి చూపుతో నిలబడి ఉన్న మోక్షజ్ఞ ను చూడొచ్చు. తమ అభిమాన హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతుండంతో నందమూరి అభిమానులు సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అక్టోబరులో మోక్షజ్ఞ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: Big News : KGF -3కి మూహుర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్…హీరో ఎవరో తెలుసా..? 

Show comments