నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనుకున్నంతగా కెరీర్ లో బడా హిట్ అందుకోనప్పటికి, తన నటనతో మంచి మార్కెట్‌ను మాత్రం ఏర్పర్చుకున్నాడు. ఇక తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషించారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్, ఈ మధ్యనే వదిలిన ప్రీ-టీజర్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగా, ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసారు.
Also Read: Saira Banu : నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవకండి..
కాగా తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్, వైరం, ప్రేమ, సెంటిమెంట్ అని కలగలిపి ఈ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా, ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’ లో, వైజయంతి పాత్ర పోషించిన విజయశాంతికి, ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ స్టోరీని డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రేమగా ఉండే తల్లి కొడుకులు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? వాళ్లిద్దరూ మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనేదే ఈ సినిమాలో కీలకమైన మలుపు. మొత్తానికి ఇటు విజయశాంతి, అటు కల్యాణ్ రామ్ మంచి కం బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.