Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య

Dada

Dada

నందమూరి బాలకృష్ణ డెడికేషన్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన సినిమాలను పరుగులు పెట్టిస్తుంటారు. తాజాగా ఆయన కమిట్‌మెంట్‌ను నిరూపించే మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘#Dada’ (దాదా) షూటింగ్ అప్‌డేట్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ హీరో అయినా కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ బాలయ్య మాత్రం రెస్ట్ తీసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించకుండా, కోలుకున్న వెంటనే నేరుగా సినిమా సెట్స్‌లోకి అడుగుపెడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం కర్ణాటకలోని చారిత్రక నగరం మైసూరుకు చేరుకుంది. రేపటి నుంచి బాలయ్య నేరుగా ఈ మైసూర్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అక్కడ ఆయనపై కొన్ని కీలకమైన మాస్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మైసూర్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిన వెంటనే.. చిత్ర యూనిట్ నేరుగా ఆంధ్రాకు షిఫ్ట్ కానుంది. గతంలో కాకినాడలో అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన షూటింగ్‌ను కూడా వెంటనే కంప్లీట్ చేసేలా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. ఇక్కడ అసలు సెన్సేషనల్ మ్యాటర్ ఏమిటంటే.. హీరోకి గాయం కావడంతో సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. “ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే ప్రకటించిన రిలీజ్ డేట్‌కే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తాం” అని ‘#Dada’ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. కేవలం ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమే బాలకృష్ణ తన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఇంత కసిగా నాన్-స్టాప్ షూటింగ్‌లో పాల్గొంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బాలయ్య డెడికేషన్, సినిమా రిలీజ్ పై టీమ్ ఇస్తున్న కాన్ఫిడెన్స్ చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు! వన్స్ ఈ సినిమా థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.