Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood Veteran Actor Nana Patekar Dies at 75: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన నానా పటేకర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గోవాలోని తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించగా.. కుటుంబసభ్యులు వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు దాదాపు 45 నిమిషాలు సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. ఉదయం 5:20 గంటలకు నానా పటేకర్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 1951 జనవరి 1న జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తెరపై ఆయన చూపించిన గంభీరమైన నటన, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘క్రాంతివీర్’, ‘పరిం దా’, ‘ప్రహార్’, ‘వెల్కమ్’, ‘నటసామ్రాట్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
Also Read
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో నానా పటేకర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లోనూ అనేక విభిన్న పాత్రలు పోషించారు. 1988లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘సలామ్ బాంబే’లో నటించి మరింత గుర్తింపు పొందారు. 1989లో విడుదలైన ‘పరిం దా’ చిత్రంలో అద్భుతమైన నటనకు నానా పటేకర్ జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. సినిమాకు, కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. గంభీరమైన పాత్రల నుంచి కామెడీ వరకు విభిన్నమైన పాత్రలను తనదైన శైలిలో పండించిన ఆయనకు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు తన నటనతో సేవలందించిన నానా పటేకర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ఆయన మరణవార్తతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నానా పటేకర్ జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!