Simbu: శివన్న హిట్ సినిమాలో శింబు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘మఫ్టీ’ ఒకటి. ఒక రౌడీ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి అండర్ కవర్ లో వచ్చిన పోలిస్ ఆఫీసర్, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు? అతని కథ ఏంటి? అనే ఎలిమెంట్స్ తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ‘మఫ్టీ’ రూపొందింది. ఇందులోని శివన్న లుక్ నే వీర సింహా రెడ్డి సినిమాలో సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి డిజైన్ చేశాడు గోపీచంద్ మలినేని. శ్రీమురళి పోలిస్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు యంగ్ హీరో శింబు. శివన్న ప్లే చేసిన రోల్ లో శింబు నటిస్తుండగా, శ్రీమురళి పాత్రలో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నాడు. డైరెక్ట్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ సినిమాకి ‘పత్తు తల’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ‘నమ్మ సత్తం’ అనే సాంగ్ రేపు మధ్యాహ్నం 12:06 నిమిషాలకి బయటకి రానుంది.
ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ‘నమ్మ సత్తం’ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. 30 సెకండ్లు కూడా లేని ఈ ప్రోమో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #NammaSatham అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ సినీ అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. సాంగ్ కి ట్రెండ్ చేసినా ఒక అర్థం ఉంది కానీ ఇలా ప్రోమోకే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అనుకుంటున్నారా? దానికి కారణం ‘పత్తు తల’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసింది, ‘నమ్మ సత్తం’ సాంగ్ కి లిరిక్స్ రాసి పాడింది కూడా రెహమాన్ కాబట్టి. ఇసైపుయల్ గా పేరు తెచ్చుకున్న రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసి, ఆయనే లిరిక్స్ రాసి, సాంగ్ పాడాడు అంటే ఆ సాంగ్ ఎలా ఉంటుందో ఒక అంచనాకి రావచ్చు. మరి ఆ అంచనాలని రెహమాన్ ఎంత వరకూ అందుకుంటాడు? తన మ్యాజిక్ ని ‘నమ్మ సత్తం’ సాంగ్ లో చూపిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
Also Read
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
Get ready for a Peppy-Trendy-Fresh musical from Isaipuyal @arrahman
Here's the glimpse of #NammaSatham, First Single from @SilambarasanTR_ @Gautham_Karthik starrer #PathuThala releasing tomorrow 12.06AM @SonyMusicSouthhttps://t.co/gaKorJiM0D pic.twitter.com/5zCVapnBi7
— Studio Green (@StudioGreen2) February 2, 2023
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!