NTV Telugu Site icon

Nagendra Babu: సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తుకాదు..ఇక్కడ టాలెంట్ ముఖ్యం..

Untitled Design (75)

Untitled Design (75)

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగ‌స్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలిజ్ ఈవెంట్ నిరహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. వారితో పాటు నిర్మాత కొణిదెల నిహారిక తండ్రి నాగబాబు కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు.

Aslo Read : Balayya: ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించనున్న బాలయ్య.. సెట్ అవుతుందా..?

ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ నాబాబు మధ్య సంభాషణ జరిగింది. ఈ నేపథ్యంలో నాగ బాబు చేసిన కామెంట్స్ కాస్త కాంట్రవర్శికి దారితీసాయి. నాగాబాబు మాట్లాడుతూ ” మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరూ ఉండరు, కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే వారిని చాలా మందిని చూస్తాం. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే అక్కినేని ఫ్యామిలీనో, నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కాదిది ఈ ఇండస్ట్రీ అందరిదీ. ఇవాళ అడివి శేష్ లాంటి ఎంతోమంది కుర్ర హీరోలు సినిమా ఫామిలీకి సంబంధం లేకుండా ఎదిగారు. వారికి ఎవరు అడ్డం వచ్చారు. వారి వారి టాలెంట్ తో పైకి వచ్చారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాలోని 11 మందిలో ఎవరు ఏ స్థాయికి కి వెళ్తారో ఎవరు ఊహించలేరు” అని అన్నారు.