NTV Telugu Site icon

NagaVamsi : రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు

Game Chenjar

Game Chenjar

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ సినిమా సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుండి. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు వండి వార్చారు.

Also Read : Veekshanam :ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది : డైరెక్టర్ మనోజ్

తాజగా సితార బ్యానర్ లో వస్తోన్న ‘లక్కీ భాస్కర్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ గేమ్ ఛేంజర్ పై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా ఎలా తయారైందో చెప్పారు. ఆయన మాట్లాడుతూ ” సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తున్నాయి, కంపిటేషన్ ఉంటుంది కదా అని జర్నలిస్ట్ అడిగిన దానికి, నాకు తెలిసి ఈ సారి ఆరు సినిమాలు రావు సో పెద్ద పోటీ ఉండదు అనే భావం వచ్చేలా చెప్పాను. దాన్ని సోషల్ మీడియాలో రామ్ చరణ్ గామే వస్తుంది కానీ ఆడియో పెద్ద పోటీ కాదంట అని నాగవంశీ అన్నాడు అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నేను కేవలం సంక్రాంతికి వచ్చే సినిమాల పైన చెప్పిన విషయాన్ని మార్చి రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు. ఏ హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ వేరే సినిమా గురించి ఎప్పడూ తక్కవుగా అనుకోడు. అందరి హీరోలతో సినిమా చేయాలని ప్రతి నిర్మాత కోరుకుంటాడు” అని అన్నారు.

 

Show comments