Site icon NTV Telugu

నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్

Nagashaurya and Ketika Sharma's New Poster from Lakshya

టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా పోస్టర్ ను పంచుకున్నాడు నాగశౌర్య. అందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కన్పిస్తోంది. ఈ రొమాంటిక్ పోస్టర్ లో కేతికా శర్మ హీరో నాగశౌర్య నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. “లక్ష్య” త్వరలోనే విడుదల కానుండడంతో పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న “లక్ష్య” అనేక అడ్డంకులను అధిగమించి క్రీడలో అగ్రస్థానానికి చేరుకున్న ఆర్చర్ ప్రయాణం.

Read Also : శతాధిక చిత్రాల విశిష్ట దర్శకుడి… ‘వశిష్ట’ రూపం!

నాగ శౌర్య చివరిసారిగా రమణ తేజ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “అశ్వత్థామ”లో కనిపించాడు. ప్రస్తుతం నాగ శౌర్య తన కిట్టిలో “పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి, ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయి” వంటి సినిమాలు ఉన్నాయి.

Exit mobile version