Site icon NTV Telugu

Coolie : ఒక్క ‘కూలీ’ చూస్తే వంద భాషల సినిమాలు చూసినట్టే – నాగార్జున

Nagarjuna Coolie

Nagarjuna Coolie

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనా‌లే నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్, ఆడియో ఈవెంట్లతో మరింత హైప్ పెంచుకుంది. కాగా విడుదలైన ట్రైలర్ కూడా అంచానాలకు మించి వేరే లెవల్‌లో ఉంది. ఇందులో స్మగ్లర్ దేవ క్యారెక్టర్ లో రజినీకాంత్ నటిస్తున్నారు. అతను ప్రతీకారం తీర్చుకునే మార్గంలో ఉన్న ఒక స్మగ్లర్ అని అర్థమవుతోంది. విలన్‌గా యాక్ట్ చేస్తున్న నాగార్జున డైలాగ్ తో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. అనిరుధ్ రవిచందర్ అందించిన స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక చెన్నైలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కి ‘కింగ్’ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : Katrina Kaif : పేరెంట్స్ కాబోతున్న మరో బాలీవుడ్‌ జంట..!

“ఈ సినిమాలో నా పాత్ర తప్పకుండా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. లోకేష్ నా క్యారెక్టర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడు” అని ఆయన చెప్పారు. అంతే కాదు.. ‘ఒక్క కూలీ సినిమా‌ను చూస్తే, వంద భాషల్లో సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. అలా ఓ పవర్‌ప్యాక్డ్ మూవీగా ఇది రూపొందింది’ అని కింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున మాటల్లోనే చెప్పాలంటే, రజినీ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫైర్ వర్క్‌లాంటిదట! ప్రేక్షకుల్లో కత్తిలాంటి అంచనాలు నెలకొన్న ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నారు.

Exit mobile version