Katrina Kaif : పేరెంట్స్ కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఒక్కప్పుడు హీరోలు హీరోయిన్ లు కెరీర్‌కి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చేవారు. వివాహ బంధానికి ఆమడ దూరంలో ఉండేవారు. ముఖ్యంగా నటిమనులు పెళ్ళి అయితే అవకాశాలు రావు అనే ఉద్దేశంతో కూడా చేసుకునే వారు కాదు. కానీ ప్రజంట్ రోజులు మారిపోయాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితానికి ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. హీరోయిన్ లు కూడా కెరీర్ పీక్స్ లో ఉండగానే మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెడుతున్నారు. అంతే కాదు ఏడాది తిరగక ముందే గుడ్ న్యూస్ కూడా చెబుతూ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కియారా – సిద్ధార్థ్‌కి పాప పుట్టింది, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తాజాగా బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ కూడా తాము పేరెంట్స్ కాబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read : Su From So : తెలుగులోకి వచేస్తున్న మరో కన్నడ హిట్ మూవీ..
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకుండానే ప్రేమలో పడిన ఈ జంట, చాలా కాలం వరకు తాము రిలేషన్లో ఉన్నామని బయటపడలేదు. అయితే కరణ్ జోహార్ షోలో కత్రినా చేసిన కామెంట్ తరువాత, అవార్డ్ వేడుకలో విక్కీ ప్రపోజల్ ఇచ్చినప్పటి నుంచి వీరి ప్రేమ కథ బహిర్గతం అయింది. అలా ఇరు కుటుంభల సమక్షంలో 2021 డిసెంబర్లో రాజస్థాన్‌లో జరిగిన వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ శుభవార్త ఏప్పుడెప్పుడు చెబుతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ మధ్య వీరిద్దరూ ముంబై నుంచి అలీబాగ్‌కి ప్రయాణిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో కత్రినా ధరించిన తెల్లటి చొక్కా చర్చనీయాంశమైంది. దీంతో సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ గాసిప్స్ ఊపందుకున్నాయి. కేవలం ప్రెగ్నెంట్ అయినవారు మాత్రమే ధరించే ఈ చొక్కాను కత్రినా ఎందుకు ధరించారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి వార్తలకు మరింత బలాన్నిచ్చే వాడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు. కత్రినా ఇప్పటికే రెండు నెలల గర్భవతిగా ఉన్నారని ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విక్కీ కానీ కత్రినా కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం తెగ సంతోషపడుతున్నారు. ఇది నిజమో, గాసిప్‌గానే మిగిలిపోతుందో – అధికారిక క్లారిటీ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..