Nasha Mukth Bharath : దేశంను డ్రగ్స్ మహమ్మారి నుంచి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలతో పాటుగా సినీ తారలు పాల్గొంటూ, డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరూ కృషి చేయాలని అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యాత్రకు వస్తున్న యువత మద్దతు అభినందనీయమని కొనియాడారు. ఇంతమంది యువత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత ముఖ్యంగా ఆసక్తి చూపించడం తనకి చాలా సంతోషాన్ని ఇచ్చిందని నాగార్జున ఈ సందర్భంగా తెలిపారు.
దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తొలగించాలనే గొప్ప సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని నాగార్జున అన్నారు. ఈ లక్ష్య సాధనలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములై ఈ ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం వారి భవిష్యత్తుకు, రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆలోచనతో ప్రారంభమైందని ప్రశంసించారు. గత రెండు రోజులుగా ఈ యాత్రను దగ్గరనుంచి గమనిస్తున్నానని, భారీ సంఖ్యలో ప్రజలు, యువత ఇందులో భాగస్వాములవడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం కోసం కిషన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని, ఈ సంకల్పానికి అందరూ తమ మద్దతు అందించాలని నాగార్జున పిలుపునిచ్చారు. అలాగే డ్రగ్స్ రహిత భారతదేశం కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించి అభినందించాలని అన్నారు. అలాగే ఈ సంకల్పానికి అందరూ తమ మద్దతు అందించాలని నాగార్జున పిలుపునిచ్చారు.

