Nagarjuna: వెంకటేష్ నుండి నాగ్ చేతికి రీమేక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ ఫోర్ పిల్లర్స్‌లో చిరు, బాలయ్య, వెంకీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి నాగార్జున సంగతేంటీ..? రీసెంట్లీ సైడ్ ట్రాక్ తీసుకున్న నాగ్.. మళ్లీ మెయిన్ ట్రాక్‌లోకి వచ్చేస్తున్నాడా..? మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేసిన కింగ్.. మరోసారి రిస్క్ చేస్తున్నాడా..? వెంకీ వదిలేసుకున్న ప్రాజెక్ట్ మన్మధుడు చెంతకు చేరిందా…? అంటే అవునని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. చిరంజీవి విశ్వంభర, అనిల్ రావి పూడి చిత్రాలతో బిజీ. బాలకృష్ణ అఖండ2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం3తో పాటు మరో త్రీ ఫిల్మ్ సెట్ చేశాడు. చిరంజీవి, బాలయ్య సినిమాలో క్యామియో అప్పీరియన్స్‌తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటీ..? సోలో హీరోగా మళ్లీ కనిపించేది ఎప్పుడు..? అని టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేం రా కార్తీక్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది.
Also Read: Sir Ganga Ram: సర్ గంగా రామ్ ఎవరు..? పాకిస్తాన్ ఎంతో గౌరవిస్తున్న హిందువు..
Also Read
నాగ్ తన వందవ చిత్రం కోసం ఆకాశం తప్ప మరో సినిమా చేయని రా కార్తీక్‌కు ఛాన్స్ ఇవ్వడం డేరింగ్ డెసిషనే.. కానీ ఈ మధ్య కాలంలో తనకు కలిసిరానీ రీమేక్స్ జోలికి మరోసారి వెళుతూ రిస్క్ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. 2023లో టూరిస్ట్ ఫ్యామిలీ ఫేం శశికుమార్, మళ్లీ రావా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీతి ఆస్రాని లీడ్ క్యారెక్టర్లలో నటించిన మూవీ ‘అయోతి’ని రీమేక్ చేయబోతున్నాడని టాక్. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఊపులో ఈ బొమ్మను తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. వెంకీ మామ వదిలేసిన అయోతి.. ఇప్పుడు నాగ్ చెంతకు చేరిందని.. అదే రా కార్తీక్ రీమేక్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది.
Also Read: Virgin Boys: ‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ అన్నారు..ఓ ఐఫోన్ ఇచ్చేశారు!
నాగ్ రీమేక్స్ చేయడం కొత్త కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు వందవ చిత్రాన్నీ సెంటిమెంట్‌గా భావించి రీమేక్ లోడ్ చేయాలన్న యోచనలో పడినట్లున్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు2, లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోతి రీమేక్ చేయడమన్నదీ పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలనుకోవడం కూడా నాగ్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. మరీ సెంటిమెంట్ కోసం రీమేకే నమ్ముకుంటాడా..? లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!