Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ హీరోకు గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి.ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్” ..నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా నటిస్తుంది.
Read Also: Rajamouli : నా కెరీర్ లో ఆ సినిమా చేసిన మ్యాజిక్ ఎప్పటికి మర్చిపోలేను..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే తాజాగా నాగ చైతన్య మరో సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.గతేడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య మూవీ చేయనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కార్తీక్ చైతూని కలిసి కథ వినిపించగా చైతూ ఓకే చెప్పినట్లు సమాచారం. నాగచైతన్యతో తెరకెక్కించే ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుందో మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.అయితే నాగచైతన్య ఈ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.