Site icon NTV Telugu

NagaChaitanya: నిశ్చితార్థం వేళ అక్కినేని అభిమానులకు మరో గుడ్ న్యూస్..?

Untitled Design 2024 08 08t134753.771

Untitled Design 2024 08 08t134753.771

ఓ వైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే మరో వైపు కెరీర్ లో మరొక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు  టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య. చైతు సినీ కెరీర్ లో భారీ హిట్ అంటే మజిలీ  అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరలేదు. ఆ కోవలోనే విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ దండు తో కలిసి నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. కార్తీక్ దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి భారీ విజయాన్ని అందుకుంది.

Also Read : Devara: దేవరపై ట్రోలింగ్ ఏమో అలా.. ఫ్యాన్స్ ఏమో ఇలా..?

ఇప్పుడు నాగ్ చైతన్య, కార్తిక్ కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమా ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టాలని స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. కార్తీక్ దండు మరోసారి థ్రిల్లర్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ను చైతూ సినిమా కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విరూపాక్ష నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణాలంలోనే ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.

ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేమమ్, సవ్యసాచి వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి కాంబినేషన్‌లో తండేల్ రానుంది. కార్తీక్ దండు విరూపాక్ష విడుదలైన తర్వాత చాలా సమయం తీసుకుని చైతూ సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఒకవైపు శోభితా తో నిశ్చితార్థం, మరోవైపు కెరీర్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇక నుండి సరికొత్త నాగ చైతన్యను చూస్తారని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Exit mobile version