Naga Bandham : కుర్ర హీరో సినిమా కోసం 20 కోట్ల క్లైమాక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్‌గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్‌లోని నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో గూస్బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ఏకంగా ₹20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.
ఒక మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. ఈ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేయబడింది. అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ సన్నివేశాలు గ్రాండ్‌గా, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్‌తో విజువల్‌గా మైండ్బ్లోయింగ్గా ఉండబోతున్నాయి. ‘నాగబంధం’ కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న “నాగబంధం” అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కథ పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో రూపొందింది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సౌందర్ రాజన్ S సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్ సి ప్రణవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు అభిషేక్ నామా క్రియేటివ్ విజన్, అద్భుతమైన నటీనటులు, టెక్నికల్ టీంతో రూపొందుతున్న ‘నాగబంధం’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ టీమ్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి, ఆసక్తికరమైన టీజర్లు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఒక మైల్‌స్టోన్‌గా నిలవనుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!