Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”

Prakash Raj , Nagababu

Prakash Raj , Nagababu

సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాజంలో లేదా ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనేదానిపై నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన పేర్కొంటూ “నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దెయ్యాలను, రాక్షసులను ఎవరూ చూడలేదు. ఏది తప్పు, ఏది రైట్ అనేది ఆ లీడర్‌కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీకున్న అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి.. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా కేవలం మీ నాయకుడిని మాత్రమే అనుసరించండి” అని పవన్ ఫొటో షేర్ చేసి రాసుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. నాగబాబు చేసిన ఈ ‘బ్లైండ్ ఫాలోయింగ్’ కామెంట్లపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. నాగబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాగబాబు గారు అంటూనే, ఆయన శైలిలోనే చురకలు అంటించారు. “అసలు ‘మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి, ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి’ అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఇలాంటి బెదిరింపులు మా దగ్గర వద్దు. ప్రశ్నించడం అనేది మా ప్రాథమిక హక్కు. ఏ నాయకుడైనా.. లేదా నేనే లీడర్‌ని అని అహంకారంతో అనుకునేవాడైనా సరే, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంటుంది. అర్థం అయిందా?” అంటూ ప్రకాష్ రాజ్ నిలదీశారు. అయితే గతంలో ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేయగా నాగబాబు, మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. మరి ఇప్పుడు ఏమైందో కానీ గత కొన్నాళ్ళుగా పవన్ సహా మెగా ఫ్యామిలీని ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

×
×
Ad