NTV Telugu Site icon

Naga Vamsi : పవన్‌తో మూవీ చేయాలనుకోవడం తప్పు..

Nagawamshi Pawankalyan

Nagawamshi Pawankalyan

ప్రజంట్ యూత్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023 చిన్న సినిమాగా వచ్చి, సూపర్ హిట్‌గా నిల్చిన ‘మ్యాడ్’ మూవీకి ఇది సీక్వెల్. మొదటి భాగం‌లో హీరోలు‌గా చేసిన వాళ్ళే రెండవ భాగం‌లో కూడా చేశారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులు‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2025, మార్చి 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కి సీక్వెల్ అంటే సాధారణంగానే క్రేజ్ తారాస్థాయిలో ఉంటుంది. దీంతో ఓవర్సీస్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా, స్టార్ హీరోలకు ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో, ఈ సినిమాకు కూడా అలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రొమోషన్స్ పై బాగా ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా రీసెంట్‌గా చేసిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యాయి.

Also Read: Samantha : ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత..

తాజాగా ఈ మూవీ హీరో సంగీత్ శోభన్ నాగవంశీ తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించాడు . ఇందులో ‘ మీరు పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ 50వ సినిమాని నిర్మించాలి. కేవలం ఒక్కరితోనే తీసే అవకాశం వస్తే, మీరు ఎవరితో చేయడానికి ఇష్టపడుతారు?’ అని అడగగా, దానికి నాగవంశీ సమాధానం ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇంకా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకోవాలి కానీ, ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం తప్పు. కాబట్టి నేను ఎన్టీఆర్ అన్న తో సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.