Site icon NTV Telugu

Naga Vamsi: ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నోడితో సినిమా ఎలా చేస్తానో అనుకున్నా!

Vijay Devara Konda, Nagavamshi

Vijay Devara Konda, Nagavamshi

తెలుగులో మోస్ట్ వైరల్ నిర్మాత ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నాగవంశీ. తన బాబాయ్ సూర్యదేవర చిన్నబాబు హారిక హాసిని క్రియేషన్స్‌లో కీలకంగా వ్యవహరించిన నాగవంశీ, తర్వాత స్వయంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగబోతున్న ఈ కథకు సంబంధించిన గ్లిమ్స్ ఇటీవల రివీల్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, దేవరకొండతో అనుభవాన్ని పంచుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు నాగవంశీ.

Also Read : Amala Paul : నేను హీరోయిన్‌ని అనే విషయం నా భ‌ర్తకి చెప్పలేదు..

‘విజయ్ దేవరకొండ తెలుగు సినీ పరిశ్రమలో బాగా అపార్థం చేసుకునే వ్యక్తులలో మొదటి వరుసలో ఉంటాడు. మా మొదటి మీటింగ్‌కు ముందు నేనూ గౌతమ్, అసలు ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోతో ఎలా సినిమా చేయాలా అని ఆలోచించేవాళ్లం. కానీ, ఒక్కసారి విజయ్‌ని కలిసాక ఆ ఆలోచనలన్నీ మారిపోయాయి. విజయ్ చాలా మర్యాదగా మాట్లాడే, అతి తక్కువ మందిలో ఒకడు. స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు ప్రపంచం చూసేది వేరు, నిజమైన విజయ్ వేరు. విజయ్ దేవరకొండ పుట్టినరోజుకు శుభాకాంక్షలు’ అంటూ ఆయన రాసుకొచ్చాడు.

 

Exit mobile version