ఆర్చరీ దీపికా కుమారి ప్యారిస్ లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ అందుకున్న దీపికా కుమారిని క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్ టెండూల్కర్… దీపికను ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లోనూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. సచిన్ తో పాటు దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి తదితరులు సైతం ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో దీపికా కుమారి నిలిచినందుకు అభినందించారు.
విశేషం ఏమంటే… హాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన దీపికా కుమారిని టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సైతం అభినందించాడు. ‘లక్ష్య’ చిత్రంలో నాగశౌర్య ఆర్చరీగా నటిస్తున్నాడు. ఈ క్రీడా నేపథ్యం చిత్రంలో ఆ పాత్ర పోషణ కోసం నాగశౌర్య గట్టి కసరత్తే చేశాడు. సో… క్రీడాకారులు విజేతలుగా నిలిడానికి ఎంతటి కష్టాన్ని పడతారో నాగశౌర్యకూ ఈ పాత్ర పోషణ ద్వారా అర్థమైంది. దాంతో దీపికా కుమారిని ఈ యంగ్ హీరో మనస్ఫూర్తిగా అభినందించాడు.