Site icon NTV Telugu

తమ్ముడిని ప్రోత్సహించమంటున్న నాగశౌర్య!

Naga Shaurya Shares pic with Brahmaji from NS22 Sets

హెడ్డింగ్ చదివేసి నాగశౌర్య తమ్ముడు కూడా సినిమాల్లో ఆర్టిస్ట్ గా వచ్చేస్తున్నాడేమో అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. నిజానికి నాగశౌర్య బ్రదర్ గౌతమ్ ప్రసాద్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. నటుడిగా కాదు కానీ నాగశౌర్య సొంత సినిమాల ప్రమోషన్స్ విషయంలో ప్రసాద్ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే… ఇక్కడ నాగశౌర్య చెప్పింది తన బ్రదర్ ప్రసాద్ గురించి కాదు. తన తోటి నటుడు బ్రహ్మాజీ గురించి. ఈ మధ్యే నాగశౌర్య 22వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దీన్ని తమ సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనే తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో బ్రహ్మజీతో పాటు నాగశౌర్య తెల్లటి లుంగీ కట్టుకుని, నుదుట నిలువు నామాలు పెట్టుకుని ఫోటోకు ఫోజిచ్చాడు.

Read Also : అభిమానుల బుద్ధి మారాలంటున్న సిద్ధార్థ్

అదే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘నా తమ్ముడు, నటుడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ అతనికి ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ యంగ్ టాలెంట్’ అంటూ కాప్షన్ పెట్టాడు. విశేషం ఏమంటే… బ్రహ్మాజీ చిత్రసీమలోకి అడుగుపెట్టి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ యంగ్ లుక్ తో అదర గొడుతుంటాడు. ఇన్ డైరెక్ట్ గా ఈ కాప్షన్ తో నాగశౌర్య కూడా అదే విషయం చెప్పాడు. బ్రహ్మాజీనా… మజాకా!!

Exit mobile version