NTV Telugu Site icon

Nag Ashwin :బాలీవుడ్ బ్యూటీ తో నాగ్ అశ్విన్ మూవీ..?

February 7 (84)

February 7 (84)

టాలీవుడ్ నుంచి పోటీ పడుతున్న దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో చెప్పకర్లేదు.ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ‘కల్కి సీక్వెల్’ చిత్రం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటివల నిర్మాత అశ్వినిదత్ జూన్ ఉంచి ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. కానీ.. ప్రభాస్ ఉన్న బిజీ చూస్తుంటే ఇప్పుడంతా లో స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ పూర్తి అయ్యాక, ‘స్పిరిట్’ సెట్స్ మీదకు రావాలి అని సందీప్ రెడ్డి వంగా చెప్పడంతో ప్రభాస్ కూడా ఎస్ చెప్పాడని టాక్. అంటే అప్పటిదాకా ‘కల్కి 2’ డౌటే. అయితే ఆలోపు అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Also Read:Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్

అవును బాలీవుడ్ స్టార్ క్వీన్ అలియా భట్ తో కథకు సంబంధించిన చర్చ చేసినట్లు ముంబై రిపోర్ట్. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో ఆమెనే మొదటి ఛాయస్‌గా పెట్టుకున్నాడట. అంతేకాదు అలియాకు స్టోరీ లైన్ చెప్పాడని.. ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి సీక్వెల్ మూవీ ప్రారంభం కావడానికి సమయం పడుతుండటంతో నాగ్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కానీ అలియాకు డేట్ల సమస్య ఉంది. ప్రజంట్ ఈ అమ్మడు ‘అల్ఫా’, ‘లవ్ అండ్ వార్’, ‘చాముండా’ వంటి చేతినిండా నిండా సినిమాలతో బిజీగా ఉంది. కనుక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చెంత వరకు వేచి చూడాలి.