వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవేటెడ్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ ‘సింగ్ గీతం’. జూన్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. నిర్మాత నాగ్ అశ్విన్ ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూ ముగింపులో టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కల్కి 2’ గురించి ఆయన ఇచ్చిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి 2’ అప్‌డేట్ గురించి నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. సినిమా పనుల గురించి లీక్ చేస్తూ.. *”కల్కి 2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల (జూలై) నుండి కంటిన్యూగా షూటింగ్ ప్లాన్ చేశాం. చాలా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేలా అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి”* అని నాగ్ అశ్విన్ అధికారికంగా వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో, సాధారణ డైలాగ్స్ లేకుండా కేవలం పాటల రూపంలోనే సాగే సరికొత్త నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా రాబోతున్న ‘సింగ్ గీతం’ జూన్ 11న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

