Site icon NTV Telugu

“రాపో19″లో నదియా ఫస్ట్ లుక్… ఎలా ఉందంటే?

Nadhiya will play a crucial role in RAPO19

తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్‌లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న నదియా ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా అన్పిస్తోంది. అయితే పిక్ షేర్ చేసిన చిత్రబృందం ఆమె సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపించబోతోంది అనే విషయంపై స్పష్టతను ఇవ్వలేదు.

Read Also : సునీల్ శెట్టి కూతురు, టీమిండియా క్రికెటర్… ‘మ్యాచ్ ఫిక్సింగ్’!

సినిమా షూటింగ్ మొదలైన ఫస్ట్ రోజున రామ్, నదియాపై మొదటి షాట్ ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి రొమాన్స్ చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. కాగా నదియా ఇటీవలే “దృశ్యం-2” సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. ఇది డిన్స్నీ + హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version