సునీల్ శెట్టి కూతురు, టీమిండియా క్రికెటర్… ‘మ్యాచ్ ఫిక్సింగ్’!

ఇండియన్ క్రికెటర్లకు బంతాటతో పాటూ బాలీవుడ్ భామలతో సయ్యాట కూడా సర్వ సాధారణమే. అయితే, చాలా వరకూ ‘బ్యూటీస్ వర్సెస్ బ్యాట్స్ మెన్ గేమ్’లో… లవ్ ‘టెస్ట్’ మ్యాచులన్నీ ‘డ్రా’గానే ముగుస్తుంటాయి. పెళ్లిల్ల వరకూ వెళ్లే ఎఫైర్లు చాలా తక్కువ. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లాంటి జంటలు అరుదు. అయితే, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ రిలేషన్ షిప్ ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది…

సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈమె పెద్దగా సంచలనాలు సృష్టించలేకపోయింది. అయితే, కెరీర్ మరీ జోరు మీద లేకున్నా అతియా పర్సనల్ లైఫ్ మాత్రం హ్యాపీగా, రొమాంటిక్ గా సాగుతోంది. అందుక్కారణం క్రికెటర్ కేఎల్ రాహుల్!

Read Also : సౌరవ్ గంగూలీ బయోపిక్ లో స్టార్ హీరో ?

రాహుల్, అతియా ప్రేమకథ చాలా రోజులుగా సాగుతోంది. వారిద్దరూ ఇంత వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. కాకపోతే, వారి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ చూస్తే వ్యవహారం ఎంత వరకూ వచ్చిందో ఇట్టే తెలిసిపోతుంది. వారి అవుటింగ్స్, డిన్నర్ డేట్స్ అన్నీ ఫోటోలు, వీడియోల రూపంలో ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటాయి. ఇక లెటెస్ట్ టాక్ ఏంటంటే… ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్ గా రాహుల్ ఆ మధ్య ఇంగ్లాండ్ వెళ్లాడు. కొన్ని మ్యాచుల్లో సత్తా చాటాడు కూడా. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే అతియా కూడా అతడి వెంట బ్రిటన్ వెళ్లింది. భారత క్రికెట్ బోర్డ్ కి రూల్స్ ప్రకారం ఆమె ఎవరో రాహుల్ చెప్పాల్సి ఉంటుంది. పెళ్లైన వారైతే తమ భార్యల్ని వెంట తీసుకుని వెళ్లవచ్చు. కానీ, కేఎల్ రాహుల్ వెంట అతియా శెట్టి ఉండటంతో ఆమె స్టేటస్ ప్రకటించాల్సి వచ్చింది!

ఇంగ్లాండ్ పర్యటనకి రాహుల్ వెంట అతియా ‘పార్టనర్’గా వెళ్లి వచ్చింది. బీసీసీఐకి ఆయన అదే అధికారికంగా చెప్పాడు! ఈ విషయం తెలిసిన చాలా మంది ఇక రాహుల్, అతియా లవ్ ఎఫైర్ అఫీషియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, సునీల్ శెట్టి కూడా కేఎల్ రాహుల్ వీడియోని ఒక దాన్ని తన సొషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేశారు. అందులో సునీల్ తనయుడు అహాన్ శెట్టి, రాహుల్ రన్నింగ్ చేస్తూ కనిపించారు. కొడుకు, అల్లుడు ఇద్దర్నీ ట్యాగ్ చేసిన సీనియర్ శెట్టి, “మై లవ్, మై స్ట్రెంగ్త్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ‘అల్లుడు’ అంటే… అదేనండీ కేఎల్ రాహుల్ అన్నమాట!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-