Site icon NTV Telugu

గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ?

Nabha Natesh to romance with gopichand

రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ హౌస్, గోపిచంద్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. దీనికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. తాత్కాలికంగా “గోపిచంద్ 30” పేరుతో ఉన్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం గోపిచంద్ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ చిత్రంలో నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆమె పేరే ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read Also : వెంకీ కుడుముల కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!

శ్రీవాస్‌తో కలిసి గోపీచంద్ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. మేకర్స్ ప్రస్తుతం మిగిలిన తారాగణం మరియు సిబ్బందిని ఖరారు చేస్తున్నారు. భూపతి రాజా కథ రాశారు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ ఇద్దరూ ‘లక్ష్యం’, ‘లౌక్యం’లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరోవైపు నభా నటేష్ తాను హీరోయిన్ గా నటించిన “మాస్ట్రో” విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో ఆమె యువ నటుడు నితిన్ తో రొమాన్స్ చేస్తోంది. ఇది హిందీ థ్రిల్లర్ డ్రామా “అంధాదున్” రీమేక్. వీరితో పాటు ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కీలకపాత్రలో నటిస్తోంది.

Exit mobile version