Site icon NTV Telugu

కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ

Nabha Natesh to debut in Kollywood

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుసగా సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. ఈ భామ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నభా నటేష్ ఇప్పుడు కోలీవుడ్ అరంగ్రేటం చేయడానికి కూడా రెడీ అయిపోతోందట. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కింది నభాకు. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా ఇద్దరూ ఓటిటి అరంగ్రేటం చేయబోతున్నారు. ప్రశంసలు పొందిన బ్రిటిష్ స్పై థ్రిల్లర్ సిరీస్ “ది నైట్ మేనేజర్”కు అధికారిక రీమేక్ ఈ వెబ్ సిరీస్.

Read Also : ఆర్ఆర్ఆర్ : “దోస్తీ” సాంగ్ కు మరో వెర్షన్ !

ఇలా బాలీవుడ్ అవకాశం వచ్చిందో లేదో నభాకు కోలీవుడ్ లో కూడా కాలుపెట్టే ఛాన్స్ వచ్చిందట. ఈ యంగ్ బ్యూటీ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో భాగం కానుందట. నభా తొలి తమిళ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. బెంగుళూరు బ్యూటీ నభా కన్నడ చిత్రం “వజ్రకాయ”తో వెండితెర ప్రవేశం చేసింది. “ఇస్మార్ట్ శంకర్”తో నభా నటేష్ కు కలిసొచ్చిన అదృష్టం ఇప్పటికి వెన్నంటే ఉందన్నమాట!

Exit mobile version