నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన ఇచ్చిన ‘ఉచిత సలహా’ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపడమే కాకుండా, మహిళా కమిషన్ నోటీసుల వరకు వెళ్ళింది. “హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల గౌరవం తగ్గుతుంది. చీరలో ఉండే అందం మరెందులోనూ ఉండదు.”, “బయట ప్రజలు మీ స్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు నటించినా, లోపల మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటారు.”, ఈ క్రమంలో ఆయన ‘దరిద్రపుముం**’, ‘సామాన్లు’ వంటి కొన్ని అనుచిత పదజాలాన్ని వాడటం విమర్శలకు ప్రధాన కారణమైంది.
Also Read :Shivaji: బాగా కావాల్సిన వారే నాపై కుట్ర చేశారు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు
శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, శివాజీకి నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని కోరుతూ నేడు హాజరుకావాలని ఆదేశించింది. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, ఇటీవల కొంతమంది హీరోయిన్లపై జరిగిన దాడులు (సమంత, నిధి అగర్వాల్ ఘటనలు) చూసి, వారి భద్రత పట్ల ఆందోళనతోనే ఆ మాటలన్నానని వివరించారు. ప్రసంగంలో అనుకోకుండా కొన్ని ‘పార్లమెంటరీ’ కాని పదాలు వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా శివాజీ మీద తెలుగు యూట్యూబర్ తనకు తాను ప్రపంచ యాత్రికుడిగా ప్రకటించుకున్న నా అన్వేషణ అన్వేష్ దారుణమైన పదజాలంతో విరుచుకు పడ్డాడు. శివాజి ఒక దొంగ ల*** అంటూ ఇంకా రాయడానికి వీలు లేని పదాలతో వీడియో రిలీజ్ చేసాడు. అయితే యూజర్ అట్రాక్షన్ కోసం అనసూయ ఫొటో పెట్టి అనుష్కదే తప్పు అంటూ ఎదో రాసుకొచ్చాడు. ట్రేండింగ్ అంశాల మీద వీడియోలు చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే నా అన్వేషణ తనకు సంబంధం లేని విషయాల్లో దూరడం ఇది మొదటి సారి కాదు.
