Site icon NTV Telugu

Tolly Wood : మలయాళ దర్శకుడితో మైత్రి మూవీస్..ఇంతకి ఎవరా దర్శకుడు..?

Untitled Design (14)

Untitled Design (14)

మళయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయి వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్.

ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయింది. 2006 లో కేరళలో కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించబడింది మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి  రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా నిలిచింది. థియేట్రికల్ ముగిసే నాటికి ఈ చిత్ర వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. అటు బాలీవుడ్, కోలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మళయాళ దర్శకుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో తన తోలి సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. కథ చర్చలు ముగిశాయని, చిదంబరం చెప్పిన కథకు మైత్రి మూవీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి. మైత్రి నిర్మాతలు ఈ చిత్రాన్ని ఏ హీరోతో తెరకెక్కిస్తారో చూడాలి. చిదంబరం దర్శకతంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ను మైత్రి మూవీస్ తెలుగులో విడుదల చేయడం కొసమెరుపు.

Also Read :Kiran Abbavaram : జాక్ పాట్ కొట్టిన కిరణ్ అబ్బవరం..రైట్స్ ఎంత ధర పలికాయో తెలుసా..?

Exit mobile version