Site icon NTV Telugu

Mythri Movies: హైదరాబాద్ లో మకాం పెట్టిన అజిత్ కుమార్.. ఎందుకంటే..?

Untitled Design 2024 08 12t124644.023

Untitled Design 2024 08 12t124644.023

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ వరుస సినిమాలతో యమా బిజీగా వున్నరు. ప్రతుతం ‘విదాముయార్చి’ సినిమాలో మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడుఅజిత్. దింతో పాటుగా‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో చిత్రంలో కూడా పాల్గొంటున్నాడు అజిత్. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులలో భారీ అంచనాలను నెలకొల్పింది. కాగా, గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ లో అజిత్ మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపించి సినిమాపై హైప్ ను పెంచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.

Also Read: Nani: దసరా – 2లో దడ పుట్టించే క్యారక్టర్ లో కనిపించబోతున్న నాని..

ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం షూటింగ్ పనులు హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నాయి. ఈ షూటింగ్ లో అజిత్ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ‘మార్క్ ఆంటోని’ తో భారీ విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని రూపొందించడం ఆసక్తిగా మారింది. నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి ప్రేక్షకులకు అందించడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు జరుపుతున్నారు.

Exit mobile version