Site icon NTV Telugu

Niharika NM : కొందరు హీరోల ట్రైలర్స్ కంటే నా వీడియోస్‌కే వ్యూస్ ఎక్కువ!

Niharika Nm

Niharika Nm

కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నిహారిక ఎన్.ఎం. ఇప్పుడు మిత్రమండలి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీస్తోంది. అయితే, ఆమె టాలీవుడ్‌లో కంటే ముందుగానే తమిళ సినీ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ పెరుసు అనే సినిమాలో ఆమె వైభవ్ భార్య పాత్రలో నటించింది. కొన్ని సినిమాలను ప్రమోట్ కూడా చేసింది. ఈ క్రమంలోనే, ఒక మీడియా ప్రతినిధి “మీరు ఒక్కొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి పది నుంచి 15 లక్షలు ఛార్జ్ చేసేవారట కదా?” అని అడిగితే, అంతకన్నా ఎక్కువే ఛార్జ్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read :Niharika NM : నాకు ‘తేడా’ కథలు ఇష్టం.. అందుకే ‘పెరుసు’ చేశా!

అంతేకాక, ఆమె మాట్లాడుతూ, కొంతమంది హీరోల ట్రైలర్స్‌కు వచ్చే వ్యూస్ కంటే నేను చేసే నా కంటెంట్ వీడియోస్‌కు వచ్చే వ్యూస్ ఎక్కువ కాబట్టి, నేను అంత ఛార్జ్ చేయడంలో తప్పేమీ లేదని ఆమె పేర్కొంది. ఇక తాను కంటెంట్ క్రియేటర్‌గా చిన్న వయసులోనే వీడియోలు చేయడం ప్రారంభించానని, సరదాగా మొదలుపెట్టిన ఆ కంటెంట్ క్రియేషన్ తనకు చాలా రాబడి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే, తాను సంపాదించిన దానిలో అధిక శాతం టాక్స్‌లు కట్టడానికే సరిపోతుందంటూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇక హీరోయిన్‌గా ఎక్కువ కష్టపడ్డారా లేక కంటెంట్ క్రియేటర్‌గా కష్టపడ్డారా? అని అడిగితే, కంటెంట్ క్రియేషన్‌కు పెద్దగా సమయం పట్టదని, అక్కడ తనకు నచ్చింది తాను చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. అయితే, హీరోయిన్‌గా నటించడం అంటే డైరెక్టర్ చెప్పింది చేయడం కాబట్టి, ఇక్కడ కాస్త కంటెంట్ క్రియేటర్‌గా చేసిన దానికన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version