Sai Abhyankar: ట్రోల్స్‌ను ట్రెండ్‌గా మార్చిన సాయి అభ్యంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ.. ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం తన సొంత టాలెంట్‌తో, ఇండిపెండెంట్ ఆడియో సింగిల్స్‌తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ (Sai Abhyankar). మమితా బైజు నటించిన ‘డ్యూడ్’ (Dude) సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్రేక్ అందుకున్న ఈ యంగ్ కంపోజర్ ఆల్బమ్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ (Karuppu) సినిమాతో సాయి అభ్యంకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సూర్య ‘కరుప్పు’ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు, రిలీజ్ అయిన కొత్తలో ఈ చిత్రం ఆల్బమ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) పై తీవ్రమైన నెగిటివిటీ, విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సాయి అభ్యంకర్ అందించిన ట్రాక్స్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రాక్స్ రీల్స్, షార్ట్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులోని ‘ఊరుమ్ బ్లడ్’ (Oorum blood) ట్రాక్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ను రూల్ చేస్తోంది.
Also Read
‘డ్యూడ్’ సినిమా విషయంలో కూడా మొదట్లో ఇలాగే జరిగి, ఆ తర్వాత చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘కరుప్పు’ విషయంలోనూ సాయి అభ్యంకర్ ‘స్లో పాయిజన్’ ఫార్ములా వర్కవుట్ అయ్యిందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక సాయి అభ్యంకర్ చేతిలో ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న తదుపరి భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka) ఉంది. ఇదే మొమెంట్ కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలోనే టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో సాయి అభ్యంకర్ చేరడం ఖాయం.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..