Risk Movie : ఆసక్తికరంగా రిస్క్ ట్రైలర్

Risk Trailer

Risk Trailer

‘సంపంగి’, ‘16’ వంటి సంచలన చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఎవర్‌గ్రీన్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రిస్క్’. ‘GK మిరాకిల్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

హీరో సందీప్ అశ్వ ఎమోషనల్ అవుతూ.. “నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్. షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. సిల్వర్ స్క్రీన్ పై నన్ను నేను హీరోగా చూసుకోవడానికి దాదాపు పదేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను. ‘రిస్క్’ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్. ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీ, ఫ్రెండ్‌షిప్ ఉంటే.. సెకండ్ హాఫ్ అంతా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా వంటి సీనియర్లతో నటించడం గొప్ప అనుభూతి. ఘంటాడి కృష్ణ గారు తన అద్భుతమైన పాటలతోనే కథ చెప్పారు. జూన్ రెండో వారంలో వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి” అని కోరారు.

×
×
Ad