Risk Movie : ఆసక్తికరంగా రిస్క్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సంపంగి’, ‘16’ వంటి సంచలన చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఎవర్గ్రీన్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రిస్క్’. ‘GK మిరాకిల్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
హీరో సందీప్ అశ్వ ఎమోషనల్ అవుతూ.. “నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్. షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. సిల్వర్ స్క్రీన్ పై నన్ను నేను హీరోగా చూసుకోవడానికి దాదాపు పదేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను. ‘రిస్క్’ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్. ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీ, ఫ్రెండ్షిప్ ఉంటే.. సెకండ్ హాఫ్ అంతా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా వంటి సీనియర్లతో నటించడం గొప్ప అనుభూతి. ఘంటాడి కృష్ణ గారు తన అద్భుతమైన పాటలతోనే కథ చెప్పారు. జూన్ రెండో వారంలో వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి” అని కోరారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!