Site icon NTV Telugu

Mukesh Chhabra : సీత గా నటించే హక్కు సాయిపల్లవికి మాత్రమే ఉంది..

Sai Pallavi Sita

Sai Pallavi Sita

తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే.  కాగా బాలీవుడ్‌లో ఇప్పుడు  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛబ్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. రణ్‌బీర్‌కి రాముడి పాత్ర ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానంగా ముఖేశ్ చెబుతూ..

Also Read : HHVM : రిలీజ్‌కి ముందే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్!

‘ఆయన ప్రశాంతమైన స్వభావం, లోతైన నటనా శైలి రాముడి పాత్రకు ఎంతో సరిపోయింది’ అన్నారు. ఇక సీత పాత్ర విషయంలో మాట్లాడుతూ.. ‘ఆ పాత్ర కోసం చాలామందిని పరిశీలించాం. కానీ చివరకు సాయిపల్లవి ఎంపికైంది. ఆమె గ్లామర్‌కి దూరంగా ఉండడం, ఫేస్‌పై సర్జరీలు చేయించుకోకపోవడం, సహజమైన అందంగా కనిపించడం వల్ల ఈ పాత్రకు ఆమెనే ఎంపిక చేశాం. ఈ చిత్రంతో సహజమైన అందానికే ప్రాధాన్యత ఉందనే సంకేతం ఇస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ప్రజంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్నికి నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా రావణుడుగా యశ్, హనుమంతుడుగా సన్నీడియోల్, లక్ష్మణుడుగా రవి దూబే నటిస్తోన్నారు. కాగా ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయబోతుంగా, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు.

Exit mobile version