Mrunal Thakur : మృణాల్‌కు హిట్‌లు ఉన్నా..పట్టించుకోని టాలీవుడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పరిస్థితి దారుణంగా మారింది. మంచి హిట్స్ ఇచ్చినా, ఫ్యాన్స్ బేస్ పెంచుకున్నా పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. మృణాల్ బాలీవుడ్‌లో టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యి, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. అయితే ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ “సీతారామం” సినిమా. దుల్కర్ సల్మాన్‌తో నటించిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆమెను హత్తుకున్నారు. ఆ తర్వాత నానితో చేసిన “హాయ్ నాన్న” కూడా మంచి హిట్ అయ్యింది. రెండు సినిమాలతోనే మృణాల్‌కి టాలీవుడ్‌లో బలమైన ఇమేజ్ ఏర్పడింది.
Also Read : Govinda- Sunita : నాకన్నా హీరోయిన్లతోనే ఎక్కువగా గడిపాడు.. గోవిందా భార్య షాకింగ్ కామెంట్స్!
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
కానీ “ఫ్యామిలీ స్టార్” మాత్రం వర్కౌట్ కాలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మృణాల్‌కి ఆఫర్లు కాస్త తగ్గిపోయాయి. ఇప్పుడామె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా “డెకాయిట్” . ఈ మూవీతో మృణాల్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇక మృణాల్ పేరుతో మరో ఆసక్తికరమైన రూమర్ కూడా వినిపిస్తోంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో ఓ కీలక పాత్రకు ఆమెను ఫిక్స్ చేశారట. కానీ ఈ వార్తకు ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు. తెలుగులో ఇలా స్లోగా ఉన్నప్పటికీ, మృణాల్ హిందీలో మాత్రం బిజీగా ఉంటుంది. అక్కడ చిన్నపాటి, పెద్దపాటి రోల్స్ ఏమైనా వచ్చినా చేయడానికి వెనుకాడదు. కానీ ఆమె ఫోకస్ మాత్రం టాలీవుడ్‌పైనే ఉందట. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగా ప్రేమించారో తెలుసని, అందుకే ఇక్కడ ఏ సినిమా వచ్చినా కాదనకుండా చేయాలని ఆమె ప్రౌండ్‌గా చెప్పిందట.
ఆడియన్స్ కూడా మృణాల్‌కి మళ్లీ మళ్లీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన రెండూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పుడు “డెకాయిట్” సినిమా సక్సెస్ అయితే మృణాల్‌కి మళ్లీ డోర్లు తెరుచుకునే అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో తమిళ సినిమాల్లో కూడా అడుగు పెట్టాలని మృణాల్ ప్లాన్ చేస్తోంది. అయితే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్లు రాలేదట. అయినా కూడా ఆమె మాత్రం ఆశలు వదులుకోలేదు. “ఏ భాష అయినా సరే, మంచి కథ వస్తే నేను తప్పక చేస్తాను” అని మృణాల్ తన కెరీర్ పట్ల నమ్మకంగా ఉంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?